This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భం దాల్చిన నాలుగు వారాల తర్వాతే సోనోగ్రఫీ ఎందుకు చేయించుకోవాలి ? (Why Is It Crucial To Get Sonography Done After Four Weeks Of Pregnancy in Telugu?)

Scans & Tests
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భం దాల్చిన నాలుగు వారాల తర్వాతే సోనోగ్రఫీ ఎందుకు చేయించుకోవాలి ? (Why Is It Crucial To Get Sonography Done After Four Weeks Of Pregnancy in Telugu?)
Likes17 Likes|
Read time5 min

పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోవాలని చాలా మంది తల్లిదండ్రులకు ఆశగా ఉంటుంది. అందులో ఒక పద్ధతే అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది చాలా మంది తల్లులను ఎక్సైట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్కాన్​లో వారు తమకు పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకుంటారు. అయితే ప్రెగ్నెంట్ అయి నెల మాత్రమే అయిన వారు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకోవడం కుదరదు. అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా బిడ్డను క్లియర్‌గా చూసేందుకు ఆరువారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.

సోనోగ్రఫీ పరీక్షతో కలిగే ప్రయోజనాలు ఏంటి? (Why Is A Sonography Test Beneficial in Telugu? )

ఒక స్త్రీ తన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తర్వాత మొదటగా గైనకాలజిస్ట్​ను సంప్రదిస్తుంది. ప్రారంభ దశల్లో అల్ట్రాసౌండ్ లేదా సోనోగ్రఫీ స్కాన్ చేయించుకోవడం వలన స్త్రీ తన కొత్త దశల గురించి కచ్చితంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ తక్షణ ఫలితాలను, ప్రభావాలను చూపించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీ గర్భందాల్చిన తొలి ఆరు వారాల తర్వాత వైద్యులు పిండాన్ని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ దశలో సోనోగ్రఫీ పరీక్ష చేయడం వలన వైద్యులకు ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన వస్తుంది. అందువల్లే సోనోగ్రఫీ పరీక్ష శిశువుకు సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని అర్థం చేసుకోవాలి. నాలుగు వారాల సమయంలో కాకుండా.. మరి కొంత సమయం వేచి ఉంటే ఇంకా స్పష్టంగా వివరాలు తెలుస్తాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

అల్ట్రాసౌండ్ స్కాన్ చూపించే ప్రెగ్నెన్సీ స్టేజెస్​ ఇవే.. (Stages Of Pregnancy Shown By An Ultrasound Scan in Telugu)

సోనోగ్రఫీ పరీక్ష 6వ వారం నుంచి 9వ వారం మధ్యలో ఏ సమయంలోనైనా శిశువు పరిస్థితిని గుర్తించడంలో సహాయపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ఏ గర్భధారణ దశలో ఉన్నారో వెల్లడిస్తుంది. ప్రారంభ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్​లో నాలుగు దశలు ఉన్నాయి.

స్టేజ్ 1

ఈ దశలో అల్ట్రాసౌండ్ స్కాన్ ఫలదీకరణ చెందిన అండంతో గర్భాశయం ఇంటరాక్షన్​ను చూపుతుంది. నిజానికి రుతు చక్రానికి సమీపంలోని ఏదైనా రోజులో ఇది జరుగుతుంది. ఈ స్కాన్​లో గర్భాశయ పొర మందంగా అవుతుండటం కూడా కనిపిస్తుంది.

స్టేజ్ 2

చివరి పీరియడ్ పూర్తయిన ఐదు వారాల తర్వాత ఈ స్కాన్ ఫ్ఫ్లూయిడ్స్‌ ఉన్న గర్భాశయ లైనింగ్​ను చూపుతుంది. ఇది గర్భధారణ సంచి అభివృద్ధిని సూచిస్తుంది.

స్టేజ్ 3

చివరి పీరియడ్ తర్వాత 6వ వారంలో గర్భధారణ సంచి అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా గర్భధారణ సంచిలో 3mm నుంచి 5mm వరకు ఉండే ఒక పచ్చని సొనను కూడా వైద్యులు గుర్తించ గలరు.

స్టేజ్ 4

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఆరు వారాల తర్వాత గైనకాలజిస్ట్ సోనోగ్రఫీ పరీక్షలో ఫెటల్ (పిండం) పోల్​ను గుర్తించగలరు. పిండం పెరుగుదలను సూచించే ప్రారంభ దశలలో ఇది ఒకటి.

గర్భిణులు అందరూ ఒకే ప్రెగ్నెన్సీ టైమ్​లైన్ ద్వారా ప్రోగ్రెస్ కారని గుర్తించాలి. సాధారణంగా స్త్రీ రుతుచక్రంతో సంబంధం ఉండటం వలన అండం ఫలదీకరణం చెందేందుకు టైమ్​లైన్ కూడా మారుతూ ఉంటుంది. చివరికి అల్ట్రాసౌండ్ సమయంలో వైద్యుడు ఏ అంశాలను గ్రహిస్తున్నారు.. అనే విషయం కూడా ఆ మార్పులకు లోబడి ఉంటుంది. అందువల్ల పరిస్థితిపై మెరుగైన క్లారిటీ కోసం ట్రాన్స్​వాజినాల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి

మరో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? (When Should One Generally Consider Getting Another Ultrasound Scan?)

మొదటిసారి గర్భం దాల్చిన వాళ్లు.. మొదటి సోనోగ్రఫీ పరీక్షలో డాక్టర్ అండం కదలిక, గుండె చప్పుడును గుర్తించకపోతే ఆందోళన చెందుతారు. తదుపరి అపాయింట్​మెంట్​ను ఎప్పుడు బుక్ చేసుకోవాలా? అనే ఆతృత ఉంటుంది. గర్భం అభివృద్ధి చెందేందుకు మరింత సమయం పడుతుంది. అల్ట్రాసౌండ్ పరీక్షను పదే పదే నిర్వహించుకోవడం వల్ల పిండం పెరుగుతుందా? లేదా? అనేది స్పష్టం కాదు. డాక్టర్ అపాయింట్మెంట్​ని షెడ్యూల్ చేయడానికి ముందు కొన్ని వారాల పాటు వెయిట్ చేయడం మేలు.

మొదటి అల్ట్రాసౌండ్ స్కాన్ గర్భదారణ సంచిని మాత్రమే చూపిస్తే.. మరో రెండు వారాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోమని డాక్టర్ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. స్కాన్​లో గర్భం, పచ్చసొన కనిపిస్తే. 11 రోజుల తర్వాత సంప్రదించమని డాక్టర్‌ చెబుతారు. ఇంకా రెండు వారాల సమయం వేచి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. సోనోగ్రఫీ పరీక్ష సమయంలో అండం పోల్ కనిపిస్తే... ఎటువంటి గుండె చప్పుడు వినిపించకపోతే అప్పుడు డాక్టర్ ఒక వారం తర్వాత మిమ్మల్ని మరోసారి స్కాన్​కు రమ్మని చెబుతారు. అటువంటి సమయాల్లో వేచి ఉండడం కొంత కష్టంగా ఉన్నప్పటికీ సాధారణంగా మల్టిపుల్‌ సోనోగ్రఫీ స్కాన్​లను నిర్వహించడం కంటే స్పష్టమైన నివేదిక పొందడం చాలా ముఖ్యం.

4వ వారంలో గర్భస్రావం అయ్యే అవకాశాలు (Probability Of Pregnancy Loss During Week 4)

ప్రెగ్నెన్సీ ఏ దశలో ఉన్నా సరే.. గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గర్భస్రావం ఎదుర్కోవచ్చు. సోనోగ్రఫీ పరీక్ష సమయంలో శిశువు పొడవు 7mm లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, పిండానికి సంబంధించిన సంకేతాలు లభించకపోతే గర్భస్రావం జరిగే ప్రారంభ దశలో సంకేతాలుగా భావించాలి.

Tags:

Sonography during Pregnancy in telugu, Ultrasound during pregnancy in telugu, result of sonography in telugu, ultrasound scan results in telugu, what is the need of ultra sound in telugu

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.